నల్గొండలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ధాటికి ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ఒక్కసారిగా ఊడిపోయింది. గాలుల తీవ్రతకు అది కొట్టుకుపోయి సమీపంలోని పెద్ద చెట్టుపై చిక్కుకుపోయింది. భారీ హోర్డింగ్ ప్రమాదకరంగా వేలాడుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.