KDP: ప్రొద్దుటూరులోని తాత్కాలిక కూరగాయల మార్కెట్లో అక్రమంగా షాపులు నిర్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండా రెడ్డి ఆధ్వర్యంలో ఈ వ్యవహారం జరుగుతోందని ఆరోపించారు. ఒక్కో షాపుకు సుమారు రూ.20 లక్షలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.