ప్రకాశం: రాచర్ల క్రాస్ రోడ్ల వద్ద తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాచర్ల పోలీసులు, నెమలిగుండ్ల రంగస్వామి గుడి ఛైర్మన్ సిద్ధం పెద్ద నరసింహులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. ప్రమాదకరమైన మలుపు వద్ద వాహనదారులకు ఇరువైపులా వచ్చే వాహనాలు కనిపించేలా ప్రత్యేకంగా సైడ్ మిర్రర్స్ను ఏర్పాటు చేశారు. వీటిని ఎస్సై పీ. కోటేశ్వరరావుకు అందజేశారు.