PPM: స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు వస్తుందని అన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో అన్నిచోట్ల గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు.