VSP: ఆర్కే బీచ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఒక మహిళను పోర్ట్ సిబ్బంది, జీవీఎంసీ ఈతగాళ్లు సకాలంలో రక్షించారు. కంచరపాలెం బర్మా క్యాంప్‌కు చెందిన డి. లక్ష్మి (37) కుటుంబ సమస్యల కారణంగా సముద్రంలోకి వెళ్లగా, విధుల్లో ఉన్న సిబ్బందిఆమెను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన ఆ సిబ్బందిని పోలీసులు అభినందించారు.