JN: జనగామ పట్టణంలోని 3వ వార్డు కోటిరత్న ఆసుపత్రి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఎండ తీవ్రతతో పిచ్చిమొక్కలు, ఎండిన గడ్డికి మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలాన్ని సీఐ సత్యనారాయణరెడ్డి, స్థానిక కౌన్సిలర్ పరిశీలించారు.