ASF: ఈనెల 29న ఆసిఫాబాద్ మండలంలోని రౌట సంకేపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల పర్యటించనున్నారని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ గురువారం తెలిపారు. ఈ మేరకు స్థానికంగా కొనసాగుతున్న ఏర్పాట్లను జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. గ్రామంలో నిర్వహించనున్న జల్ జంగల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవంలో పాల్గొంటారని సుగుణ పేర్కొన్నారు.