KMM: ప్రజా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆదేశాలతో సీఐకి ఫిర్యాదును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ దోమ ఆనంద్, గాదె చెన్నారావు, చల్లగుళ్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.