ASR: డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని డుంబ్రిగుడ మండల వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో పేపర్ లీకేజీలు, డేటా తొలగింపులు, మెరిట్ జాబితాల గల్లంతు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.