NLG: విద్యారంగ సమస్యల కోసం టీఎస్ యూటిఎఫ్ చిట్యాల మండల పూర్వ అధ్యక్షులు, స్వర్గీయ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు చేసిన కృషిని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనియాడారు. వనస్థలిపురంలో గురువారం జరిగిన సంస్మరణ సభకు ఆయన హాజరై మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు మరణం ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని, విలువలతో కూడిన గొప్ప నాయకుడని కొనియాడారు.