TG: భారత షూటింగ్ చరిత్రలో ఇషాసింగ్ విజయం చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆమె అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇషా సింగ్ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించి, దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.