BDK: అశ్వాపురం మండలం, మొండికుంట గ్రామంలో మాజీ ఎంపీటీసీ కమటం నరేష్ ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంకును ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.