SDPT: కోహెడ మండలంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు విశిష్ట సేవలు అందించిన టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. భారత అత్యున్నత గౌరవాన్ని ఎన్టీఆర్కి ఇవ్వాలన్నారు.