BDK : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం రూ. 53 లక్షలు కేటాయించింది. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ నిధులు మంజూరు చేశారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాకు అత్యధికంగా రూ.14.55 లక్షలు కేటాయించినట్టు అధికారులు తెలిపారు.