MLG: పంట పొలాల్లో వ్యర్థాలను తగలబెట్టడం వల్ల భూమి సారం తగ్గడంతో పాటు పక్కనున్న పంటలు, డ్రిప్ పైపులు, బోర్లు దగ్ధమై నష్టం జరుగుతోందని ములుగు ఎస్సై ఉపేందర్ రావు గురువారం హెచ్చరించారు. రహదారుల పక్కన పొలాలు తగలబెట్టడం వల్ల పొగ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.