ATP: తన జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత వెంకటాపురంలో ఇలవేల్పు ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పరిటాల ఘాట్ వద్దకు చేరుకుని పరిటాల రవికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమెను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పరిటాల అభిమానులు, అధికారులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.