HYD: పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మహిళా నేతలు ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నేడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన అధికారులు, మహిళా నేతలకు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది.