VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొండపల్లి మండలం దేవుపల్లిలో గురువారం సందడి చేశారు. టీడీపీ మహానాడు వేడుకలు రెండో రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులతో కలిసి సాంప్రదాయ ‘తప్పుడు గుళ్ళు’ నృత్యం చేస్తూ అందరినీ ఎంతగానో ఉత్సాహపరిచారు.