WGL: గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని ఏఐటీయుసీ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సంఘం నల్లబెల్లి మండలకార్యదర్శి మామిడిపల్లి రవి అన్నారు. గురువారం సంఘం మండల ముఖ్య నాయకుల సమావేశం జరుగగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు.