MHBD: కేంద్ర ప్రభుత్వం రైతుల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని అఖిల భారత రైతుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సక్రు డిమాండ్ చేశారు. గురువారం గార్ల మండల కేంద్రంలో కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల జీవోల కాపీలను అయన దగ్ధం చేసి మాట్లాడుతూ.. కేంద్రం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు.