ఎలిమినేటర్ మ్యాచ్లో 97 పరుగుల వద్ద అవుటైనందుకు బాధగా లేదని వైభవ్ సూర్యవంశీ స్పష్టం చేశాడు. హర్ష భోగ్లే అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తనకు సెంచరీల కంటే జట్టు విజయమే ముఖ్యమని చెప్పాడు. మైలురాళ్ల గురించి ఆలోచిస్తే కెరీర్లో విజయం సాధించలేనన్నాడు. బౌలర్లపై ఒత్తిడి పెంచడమే తన లక్ష్యమని, గెలిపించినప్పుడు 100 కంటే 97 పరుగులే గొప్పవని వైభవ్ పేర్కొన్నాడు.