WGL: వెంకటాపురం మండలంలోని వెంగళరావు పేటకు చెందిన రైతు బట్టా సాంబయ్యకు చెందిన ట్రాక్టర్ బ్యాటరీ బుధవారం రాత్రి చోరీకి గురైంది. వ్యవసాయ పనులు ముగించుకుని రాత్రి ఇంటి బయట ఉంచిన ట్రాక్టర్ నుంచి గుర్తు తెలియని దుండగులు బ్యాటరీని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.