GDWL: ధరూర్ మండలం జాంపల్లి గ్రామ శివారులో తాయమ్మమిట్ట వద్ద గద్వాల- రాయచూరు జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. వర్షాకాలంలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్నేళ్లుగా తాత్కాలిక మరమ్మతులు మాత్రమే జరుగుతున్నాయని, శాశ్వతంగా గుంతలు పూడ్చాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.