NZB: అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వంపరంగా కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం భరోసా కల్పించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరిస్తున్న తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.