PPM: కొమరాడ మండలం మాధలింగి క్లస్టర్ 9 పరిధిలో నిర్వహించిన ‘హైబ్రిడ్ మహానాడు-2026’ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆమె పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. లాబేసు వంతెన పనులు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.