BDK: అశ్వాపురంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి చెత్త కుప్పలో పడేశారంటూ గురువారం దళిత సంఘాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాయి. విగ్రహాన్ని తిరిగి అదే స్థలంలో ప్రతిష్టించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.