BHPL: గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన నోముల వనమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి గురువారం ఆమె నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.