ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తెలుగుదేశం పార్టీకి రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. పార్టీ బలోపేతం కోసం విరాళం అందించిన ఎమ్మెల్యేను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వెంకటప్రసాద్‌కు అభినందనలు తెలియజేశారు.