విశాఖలోని కేజీహెచ్ వద్ద మందులు, వైద్య సిబ్బంది కొరతపై గురువారం CITU ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు వై.వై.రాజు మాట్లాడుతూ.. కేజీహెచ్‌లో మందులు, వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉందని ఆరోపించారు. ఎమ్మారై, సిటీ స్కాన్ పరీక్షల్లో ఆలస్యం జరుగుతోందని, స్మార్ట్‌ఫోన్ లేని రోగులకు ఎక్స్‌రే సేవలు అందకపోవడం అన్యాయమన్నారు.