WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల సమావేశం జరిగింది. ప్రతినెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు కార్మిక నాయకుడు మామిడిపల్లి రవి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.