HNK: కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కాలనీకి చెందిన ఆయిల్ సరోజ (60) అనే వృద్ధురాలు అదృశ్యమైనట్లు సీఐ శ్యాంసుందర్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం మూడు రోజుల కింద ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రానట్లుగా భర్త సంపత్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు వివరించారు.