NLG: జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈద్గా మైదానాలు, మసీదుల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మతసామరస్యంతో పండుగ జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.