KNR: మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామంలో జరిగిన ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎల్లమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు.