KMM: జూన్ 1 నుంచి మధిర రైల్వే స్టేషన్ విజయవాడ డివిజన్ పరిధిలోకి రానుంది. ఇప్పటివరకు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న మధిరతో పాటు తొండలగోపవరం, చెరువుమాదారం, కొండపల్లి ప్రాంతాల రైల్వే పరిపాలనను విజయవాడ డివిజన్‌కు మార్చినట్లు అధికారులు తెలిపారు. కిలోమీటర్ 568నుంచి 525 వరకు పరిధి మార్పులు అమల్లోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.