Medico Preethi : అత్యంత విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి
వరంగల్(Warangal) ఎంజీఎం(MGM)లో సీనియర్ వేధింపులు తాళలేక విద్యార్థి ప్రీతి(Preethi) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీతి(Preethi)కి నిమ్స్(NIMS) ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. అయితే ప్రీతి(Preethi) ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని నిమ్స్(NIMS) వైద్యులు వెల్లడించారు. ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందిస్తున్నామన్నారు.

రాత్రి 8 గంటలకు ప్రీతి(Preethi) ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ప్రీతి బ్రెయిన్ డెడ్(Brain Died) అయ్యిందని వైద్యులు కుటుంబీకులకు తెలిపినట్లు సమాచారం. ప్రీతి(Preethi) తండ్రి మాట్లాడుతూ..ఏమాత్రం ఆశలు లేవని వైద్యులు తెలిపారన్నారు. మొదటి రోజు పోలిస్తే ఇంకా పరిస్థితి క్షీణించిందన్నారు. ప్రీతి శరీరం రంగు కూడా మారిపోయినట్లు తెలిపారు. ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఆశించామన్నారు.
ఈ ఘటనపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ప్రీతి(Preethi) దుస్థితికి కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదని, అది ముమ్మాటికి హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైఫే తన కూతుర్ని హత్య చేశాడని, ప్రీతి జోలికి రాకుండా సైఫ్ ను నియంత్రించేలేకపోయానన్నారు. ఈ సమస్యను హెచ్ఓడీ(HOD) సరిగా హ్యాండిల్ చేయలేదన్నారు. ప్రీతి(Preethi) ఆ రోజు ఉదయం 4.30 గంటలకు ఆత్మహత్యాయత్నం చేసుకుంటే 8 గంటల వరకూ కూడా తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రీతి(Preethi) మొబైల్ లో వారికి కావాల్సినట్లుగా సాక్ష్యాలను క్రియేట్ చేసుకున్నట్లు ఆరోపించారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి సీరియస్ అవ్వడంతో నిమ్స్(NIMS) వద్ద పోలీసులు భద్రతను పెంచారు.