SRPT: కోదాడలో బీజేపీ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన రుణబోతు వెంకటరెడ్డిని పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. పట్టణ అధ్యక్షుడు గోదేశి లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా పార్టీకి సేవలందిస్తున్న వెంకటరెడ్డికి ఈ పదవి రావడం ఆనందకరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.