నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఈదుగా వద్ద నిర్వహించిన బక్రీద్ వేడుకలలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వాకిడి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ సోదరులు సుఖ సంతోషాలతో ఆనందంగా బక్రీద్ పండగలు జరుపుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు.