ADB: జూన్ 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి కాగజ్ నగర్లో పర్యటించనున్నారని DCC అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశమై ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.