GNTR: చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకున్నారని మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. బుధవారం తాడేపల్లిలో మాట్లాడిన ఆమె.. బాబు ఎన్నడూ బీసీల అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. అలాంటిది, ఇప్పుడు మహానాడు వేదికగా తాము బీసీలకు ఎంతో చేసేశామంటూ గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు.