ELR: చింతలపూడి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. మండలంలోని ఎర్రగుంటపల్లిలో చౌటపల్లి మల్లేష్ వద్ద లీటరు సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. అదేవిధంగా చౌటపల్లి మరియమ్మను అదుపులోకి తీసుకుని, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. ఆమెకు బైండోవర్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు.