HNK: జిల్లాలోని అన్ని మండలాల్లో నిలిచిపోయిన రెవెన్యూ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రవితో కలిసి ఆర్డీవోలు, తహసీల్దారులతో సమావేశమై రెవెన్యూ అంశాలపై సమీక్ష చేశారు. భూభారతి పోర్టల్, ప్రజా సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని తాహసీల్దారులకు కలెక్టర్ ఆదేశించారు.