PDPL: రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని సత్వరమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.