JGL: మెట్పల్లి పట్టణంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలు సంయుక్తంగా బుధవారం ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశాయి. మండల వ్యవసాయ అధికారిణి దీపిక దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు, బిల్లులు, రిజిస్టర్లు పరిశీలించారు. రైతులకు సరైన రసీదులు ఇవ్వాలని వ్యాపారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయం జరిగితే కఠిన చర్యలు తప్పన్నారు.