TG: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇవాళ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 45- 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 155 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించనున్నారు.