NLG: పరిశ్రమల్లో కార్మికుల భద్రతే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి క్రైసిస్ కమిటీ సమావేశం జరిగింది. ఇటీవల జిల్లాలోని పలు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాలను ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.