జర్మనీలోని మునిచ్లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో 43 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచిన ఇషా.. సౌత్ కొరియా షూటర్ కిమ్ యె జి (42) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఇషాకు ఇది రెండో ప్రపంచకప్ స్వర్ణం కాగా, ఒలింపియన్ మను భాకర్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది.