RRతో జరుగుతున్న మ్యాచ్లో SRH ఓటమి దిశగా పయనిస్తోంది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్.. 6.5 ఓవర్లలో 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. RR బౌలర్ జోఫ్రా ఆర్చర్.. అభిషేక్ శర్మ(0), ట్రావిస్ హెడ్(17), ఇషాన్ కిషన్(33) వికెట్లు పడగొట్టి SRH పతనాన్ని శాసించాడు. హెన్రిచ్ క్లాసెన్ కూడా 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.