సాధారణంగా సెలబ్రిటీలు కఠినమైన డైట్ పాటిస్తుంటే, రానా మాత్రం భిన్నంగా తన ఫుడ్ హ్యాబిట్స్ను పంచుకున్నాడు. తాను పక్కా నాన్వెజిటేరియన్ అని, కొత్త వంటకాలను ట్రై చేయడం ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, అక్కడి లోకల్ నాన్వెజ్ రుచులను అస్సలు వదిలిపెట్టనని రానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.