TG: టాలీవుడ్లో పర్సంటేజీల వివాదం సద్దుమణిగింది. చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ నిర్ణయం వాయిదా పడింది. ‘పెద్ది’ సినిమాను రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే సినిమాలకు పర్సంటేజీ విధానం వర్తింపజేస్తామన్నారు. టికెట్ ధరలు పెంచితే 7.5% ఎగ్జిబిటర్లకు చెల్లించనున్నారు. ఈ నిర్ణయంపై చిరు సంతోషం వ్యక్తం చేశాడు.