KRNL: ఆదోని మండలం పాండవగల్లు గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై ఆదోని వైపు వెళ్తున్న వ్యక్తిని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.